జీ 20 అంటే గ్రూప్ అఫ్ 20 కంట్రీస్ అని అర్ధం. అసలు ఈ జి20 సదస్సు ఎందుకు జరుగుతుంది? దీని ఎజెండా ఏంటి? ఈ భేటీ ప్రాధాన్యం ఏంటి? ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలే ఈ గ్రూప్ అఫ్ 20 కంట్రీస్. 1999లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అగ్ర దేశాల మధ్య ఆర్థిక సహకారం కోసం ఈ జి20 గ్రూపును ఏర్పాటు చేసారు. ఈ గ్రూపులో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నారు.. ఇందులో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ సహా అగ్రదేశాలన్నీ ఉన్నాయి. అందుకే జీ20 కు అంతటి ప్రాధాన్యత..
జీ20ను ఓ విధంగా చెప్పాలంటే మినీ యూఎన్ఓగా పరిగణిస్తారు. ప్రపంచ జీడీపీలో 85 శాతం వాటా ఈ 20 దేశాల సభ్యులదే, ప్రపంచ జనాభాలో 70 శాతం ఈ దేశాల నుంచే ఉండటం గమనార్హం. ఈ బృందానికి తనకంటూ శాశ్వత సభ్యులు, సిబ్బంది ఎవరూ ఉండరు. కాబట్టి ఈ గ్రూపులోని ఒక దేశం తమ వంతు వచ్చినపుడు.. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో సమ్మిట్ కు అధ్యక్షత వహిస్తుంది. వచ్చే జి20 సదస్సును, దానికి సంబంధించి జరిగే చిన్న చిన్న సమావేశాలను నిర్వహించే బాధ్యతను ఆ దేశం అంగీకరిస్తుంది.
జీ-20 సభ్యులు కాని దేశాలను ఈ సదస్సుకు గెస్ట్ లను ఆహ్వానించటానికి, అలాంటి దేశాలను ఎంపిక చేయటానికి ఈ దేశానికి వీలుంటుంది. అలా స్పెయిన్ ను ప్రతీసారి ఈ సదస్సుకు ఆహ్వానిస్తుంటారు. అయితే ఇందులో ఏకాభిప్రాయంతో తీసుకునే నిర్ణయాలపై ప్రధానంగా ప్రస్తావన ఉంటుంది. 1999లో ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో పరస్పర సహకారం కోసం జీ20 ఏర్పాటైంది. ఆ తరువాత పరిస్థితుల రీత్యా, ఎజెండా మారింది. కేవలం ఆర్థిక సంక్షోభం కోసమే కాకుండా..వాణిజ్యం, సమగ్రాభివృద్ధి, వ్యవసాయం,ఇంధనం, వాతావరణ మార్పులు, పర్యావరణం, అవినీతి నిరోధక చర్యలు, ఆరోగ్యం, వంటి అంశాల్లో కూడా ప్రతీ దేశానికి సహకారం ఉండాలని ఎజెండా మార్చుకున్నాయి.
అయితే ఈ జీ 20కు ఓ సచివాలయం, హెడ్ క్వార్టర్స్ అంటూ లేవు. అదే దీనికి పెద్ద మైనస్. ఈ జి20 గ్రూపును స్థాపించి 24 ఏళ్ళు అవుతున్నా ఇప్పటివరకు సెక్రెటేరియేట్ లేదు. అందుకే ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క దేశం జి20 సమ్మిట్ ను హోస్ట్ చేస్తుంది. ఏ ఏడాది ఏ దేశానికి హోస్ట్ చేసే బాధ్యతలు లభిస్తే ఆ దేశంలో సమ్మిట్ జరుగుతుంది. మొదటి జి20 సదస్సు 1999జర్మనీలో ప్రారంభించగా 2008 నుంచి జరిగే సదుస్సులే ప్రాధాన్యం..ఎందుకంటే దేశ అధ్యక్షులు, ప్రధానులు 2008నుంచే జి20 సదస్సుకు తప్పనిసరిగా హాజరు అవుతున్నారు..
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో 2008లో జరిగింది.. 2009లో లండన్, జూన్ 2010లో కెనడా, నవంబర్ 2010లో దక్షిణ కొరియా, 2011లో ఫ్రాన్స్, 2012లో మెక్సికో, 2013లో రష్యా, 2014లో ఆస్ట్రేలియా, 2015లో టర్కీ, 2016లో చైనా, 2017లో జర్మనీ, 2018లో ఆర్జెంటినా, 2019లో జపాన్, లో జరగగా..
2020లో సౌదీ అరేబియా, 2021లో ఇటలీ, 2022లో ఇండోనేషియా జీ 20 హోస్ట్ చేయగా.. 2023 బాధ్యతలు ఇండియాకు దక్కాయి. 2022 డిసెంబర్ 1న లో ఇండియా సారధ్య బాధ్యతలు ప్రారంభమయ్యి.. అవి 2023 నవంబర్ 30 వరకూ ఉంటాయి. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగనుంది. ఇండియా తరువాత 2024లో బ్రెజిల్ ఈ బాధ్యతలు తీసుకోనుంది.
మొదట్లో ఈ సదస్సుకు ప్రధానంగా ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు వెళ్లేవారు.. కానీ 2008లో ఎదురైన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బ్యాంకులు నష్టపోవడం, నిరుద్యోగం పెరగడం, వేతనాల్లో కోత విధించడం వంటి పరిస్థితులతో జీ20 సదస్సు ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు ఈ జి20 సదస్సుకు హాజరవడం అత్యవసరంగా మారిపోయింది. ఇప్ప్పుడు ఈ జి20 సదస్సుకు అధ్యక్షులు, ప్రధానమంత్రులు తప్పనిసరిగా హాజరవుతున్నారు.
అయితే ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి.. ఈ గ్రూప్ నిర్ణయాలు కచ్చితంగా అమలు చేయాలనే రూల్ ఏమి లేదు.. నిర్ణయాలు అమలు చేయకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం, శిక్షలు వేయడం లాంటివి ఉండవు..అందుకే జి20 సదస్సులో తీసుకునే నిర్ణయాలు ఏకాభిప్రాయంతో అంగీకరిస్తారు.. ఇక జి20 సదస్సుకు భారత్ నాయకత్వం వహిస్తున్న సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేశారు.. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే లక్ష్యంతో జి20 సదస్సుకు భారత్ నిర్వహిస్తోంది. భారత సంస్కృతి సాంప్రదాయాల్లోని విలువల ఆధారంగానే ఈ జి20 సదస్సును ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటేనే ఈ భూమి సురక్షితంగా ఉంటుందనే సందేశాన్ని భారత్ ఈ సందర్భంగా ప్రపంచానికి చాటుతోంది.
ఈ ఏడాది జి20 చైర్మన్గా భారత్ రెండు ట్రాక్ లపై ప్రధానంగా పని చేసింది.. ఒకటి ఫైనాన్షియల్ ట్రాక్, మరొకటి షేర్పా ట్రాక్. ఆర్థిక అంశాలపై ఆ దేశాల ఆర్థిక మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. షేర్పా ట్రాక్ వర్కింగ్ గ్రూపులో అనేక శాఖలకు సంబంధించిన మంత్రులు ఏడాది పొడవున వివిధ సమ్మిట్ లను నిర్వహిస్తారు. ఇవే కాకుండా ఎంగేజ్మెంట్ గ్రూప్స్ కూడా ఉంటాయి. వాటి ద్వారా సివిల్ సొసైటీస్, బ్థింక్ ట్యాంక్స్, పార్లమెంటేరియన్స్, యువత, మహిళ ,బిజినెస్, లేబర్, రీసర్చ్ తో ఈ గ్రూప్ 20 చర్చలు జరుపుతున్నందున వీటిని ఎంగేజ్మెంట్ గ్రూప్స్ గా పిలుస్తారు.