కొత్తగా ఎనిమిదో ఖండం! 365 ఏళ్ల తరవాత గుర్తించిన శాస్త్రవేత్తలు..!
ప్రపంచంలో ఏడు ఖండాలు మాత్రమే ఉన్నాయ్. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుతూ, వింటూ వస్తున్న వాస్తవం. ఎన్సైక్లోపీడియాలో కూడా ఇలాగే ఉంటుంది. కానీ దీన్ని తప్పు అని నిరూపించారు శాస్త్రవేత్తలు. ప్రపంచంలో ఏడు కాదు ఎనిమిది ఖండాలు ఉన్నాయ్ అంటున్నారు. అందేంటి? ఎనిమిదో ఖండం ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా ఏర్పడిందా? అనే డౌట్ వస్తుంది కదా! మరి లేట్ చేయకుండా మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఇప్పటివరకు మనకి తెలిసి ఏడు ఖండాలు మాత్రమే ఉన్నాయ్. కానీ ఇప్పటి నుంచి ఎనిమిది ఖండాలు ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది.. దీన్ని కనిపెట్టడానికి శాస్త్రవేత్తలకు 365 ఏళ్ళు పట్టింది. అవును మీరు విన్నది నిజమే. తాజాగా జియోలోజిస్ట్స్, సేసిమోలోజిస్ట్స్ టీమ్ ఈ కొత్త ఖండాన్ని కనుగొన్నారు. దీనికి సంబంధించిన విషయాలను టెక్నోటిక్స్ జర్నల్ లో ప్రచురించారు.
ఈ కొత్త ఖండం పేరు జిలాండియా లేదా టె రియు-ఎ-మౌయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ ఖండంతో కలిపి కొత్త మ్యాప్ ను రూపొందించినట్లు ఫిజిక్స్.ఆర్గ్ తెలిపింది. ఈ కొత్త ఖండం దాదాపు 94 శాతం సముద్రపు జలాల్లో దాగి ఉందని తెలిపారు. ఈ కొత్త ఖండం 1.89 మిలియన్ చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉందని వెల్లడించారు. అయితే ఇది మడగాస్కర్ కంటే ఆరు రెట్లు ఎక్కువ ఉంటుందట. దీంతో మనకి 8 ఖండాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అతి పిన్న వయస్కురాలైన ఖండంగా ఇది అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. ఇక అసలు విషయం ఏంటంటే..ఈ ఎనిమదవ ఖండం 94 శాతం సముద్రపు నీటిలో దాగి ఉంది. అందుకే ఈ ఖండాన్ని అధ్యయనం చేయడం చాలా క్లిష్టతరంతో పాటు దీన్ని వెలికితీసేందుకు చాలా సమయం పడుతుందన్నారు. సముద్రపు అడుగు భాగం నుంచి డ్రిల్లింగ్ చేసి సేకరించిన రాళ్లు, అవక్షేప నమునాల సాయంతో అధ్యయనం చేస్తున్నారు. వీటిలో ఎక్కువ భాగం డ్రిల్లింగ్ సైట్ల నుంచి సేకరించగా.. మిగతావి అక్కడ ఉన్న దీవుల తీరాలలో కాలేచ్ట్ చేసారు.
ఈ ఖండం పశ్చిమ అంటార్కిటికాలో భౌగోళిక లక్షణాలతో పోలి ఉందన్నారు. ఇది న్యూజిలాండ్ వెస్ట్ కోస్ట్ లోని క్యాంప్‌బెల్ పీఠభూమి సమీపంలోని ఉన్నట్లు తెలిపారు. ఇక ఈ ప్రాంతంలో శాస్త్రవేత్తలు అయస్కాంత క్రమరాహిత్యాలను ఇంకా గుర్తించలేదు. ఈ జిలాండియా ఖండం సుమారు 550 మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, పురాతన సూపర్ ఖండమైన గోండ్వానాలో ఒక భాగం అని చెబుతున్నారు భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు. ఇక మరీ ముఖ్యంగా దక్షిణ అర్థగోళంలోని మొత్తం భూమిని కలిపిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.